Abn logo
Apr 5 2020 @ 13:53PM

ఒంగోలులో 10 మాంసం షాపులు సీజ్

ప్రకాశం: జిల్లాలో కరోనా కట్టడికోసం అధికారులు చేస్తున్న సూచనలను ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లాక్ డౌన్ పక్కనపెట్టి చికెన్, మటన్ షాపుల ముందు ప్రజలు క్యూ కట్టారు. గుంపులు గుంపులుగా ఒకచోటకు చేరారు. సామాజిక దూరాన్ని పక్కనపెట్టారు. దీంతో పోలీసులు ఒంగోలు నగరంలో సుమారు 10 షాపులను సీజ్ చేశారు. సామాజిక దూరం పాటించాలని వినియోగదారులు, షాపు యజమానులకు సూచించారు. కాగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 21 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒంగోలు నగరంలో 7 కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement