Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 6 2021 @ 14:28PM

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కరోనా రోగులు సజీవదహనం

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు అహ్మద్ నగర్ కలెక్టర్ రాజేంద్ర భోస్లే ప్రకటించారు. ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో అందులో చికిత్స పొందుతున్న కరోనా రోగులు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా కరోనా వార్డులో 17 మంది చికిత్స పొందుతుండగా వారిలో 10 మంది అగ్నిప్రమాదంలో మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement