మిధానీలో 10శాతం వాటా విక్రయం

ABN , First Publish Date - 2020-11-23T06:34:47+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ)లో 10 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది...

మిధానీలో 10శాతం  వాటా విక్రయం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ)లో 10 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా ఈ వాటాల విక్రయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ఈ వాటాలను విక్రయించాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం 10 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.360 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.  2018 ఏప్రిల్‌లో మిదానీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ప్రభుత్వం 26 శాతం వాటాను విక్రయించి రూ.438 కోట్లు సమీకరించింది. 


Updated Date - 2020-11-23T06:34:47+05:30 IST