10ఆర్‌ పిల్ల కాలువ గండి పూడ్చివేత

ABN , First Publish Date - 2020-08-04T10:21:26+05:30 IST

శ్రీముఖలింగం వద్ద 10ఆర్‌ పిల్ల కాలువకు పడిన గండిని వంశధార అధికారులు యుద్ధప్రాతిపదికన సోమవారం పూడ్చే చర్యలు ..

10ఆర్‌ పిల్ల కాలువ గండి పూడ్చివేత

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


శ్రీముఖలింగం (జలుమూరు) ఆగస్టు 3:  శ్రీముఖలింగం వద్ద 10ఆర్‌ పిల్ల కాలువకు పడిన గండిని వంశధార అధికారులు యుద్ధప్రాతిపదికన సోమవారం పూడ్చే చర్యలు చేపట్టారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘10ఆర్‌ పిల్లకాలువకు గండి’  శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గోనె సంచుల్లో మట్టితో నింపి గండి పడిన ప్రాంతంలో ఏర్పాటు చేసి పూడ్చారు. కాలువ కింద ఉన్న అచ్చుతాపురం, నగిరికటకం, మెట్టపేట పొలాలకు సాగునీటిని అందించారు. వంశధార ఏఈ ఎం.రాంబాబు పనులను పర్యవేక్షించగా అధికారులు గండి పూడ్చివేయించడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-08-04T10:21:26+05:30 IST