డైనోసార్లపై పుస్తకం!

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

పదేళ్ల వయసులో పుస్తకం రాయడమంటే మాటలు కాదు. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన తత్య అపూర్వ పారిక్‌ డైనోసార్లపై పుస్తకం రాసి అందరి మన్ననలు అందుకున్నాడు...

డైనోసార్లపై పుస్తకం!

పదేళ్ల వయసులో పుస్తకం రాయడమంటే మాటలు కాదు. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన తత్య అపూర్వ పారిక్‌ డైనోసార్లపై పుస్తకం రాసి అందరి మన్ననలు అందుకున్నాడు.


  1. పారిక్‌ డైనోసార్లకు సంబంధించిన పూర్తి సమాచారంతో ‘‘ద అల్టిమేట్‌ గైడ్‌ టు డైనోసార్స్‌’’ అని పుస్తకం రాశాడు. ఇందులో భూమిపై నివసించిన 55 ప్రధాన డైనోసార్లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచాడు.
  2. డైనోసార్లు నిజంగా భూమిపై నివసించాయా? ఎక్కువ ఏ ప్రదేశంలో నివసించాయి? వాటికిష్టమైన ఆహారం ఏమిటి? డైనోసార్లు ఎగురుతాయా? ఇలాంటి వంద ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు అందించారు. 
  3. ఈ పుస్తకానికి తత్య పారిక్‌ కో రైటర్‌గా వ్యవహరించాడు. తన ప్రతిభతో యంగెస్ట్‌ రైటర్‌గా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు. 

Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST