6 నెలల్లో 100% డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్‌ దూకుడు

ABN , First Publish Date - 2020-09-19T05:50:35+05:30 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ షేర్‌ ధర గత ఆరు నెలల్లో దాదాపు 100 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే బీఎ్‌సఈలో 10.36 శాతం లాభంతో రూ.

6 నెలల్లో 100% డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్‌ దూకుడు

ఒక్క రోజులో 10% పెరుగుదల

రికార్డు స్థాయికి షేరు ధర


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ షేర్‌ ధర గత ఆరు నెలల్లో దాదాపు 100 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే బీఎ్‌సఈలో 10.36 శాతం లాభంతో రూ.5,326.70 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 13.88 శాతం లాభపడింది. ఎన్‌ఎ్‌సఈలో కూడా 9.92 శాతం లాభంతో రూ.5,306కు చేరిం ది. ఈ స్థాయికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్‌ చేరడం ఇదే ప్రథమం.


కంపెనీ చేసిన సానుకూల ప్రకటనలతో వరుసగా నాలగు రోజులుగా లాభాల్లో ట్రేడవు తోంది. దాదాపు ఆరు నెలల క్రితం మార్చి 19న డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ధర రూ.2,624  వద్ద ఉంది. శుక్రవారం ముగింపు రూ.5326తో పోలిస్తే దాదా పు 100 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో దాదాపు 22 శాతం లాభపడింది.


పేటెంట్‌ వివాదం పరిష్కారంతో

బ్లడ్‌ కేన్సర్‌ ఔషధం లెనలిడోమైడ్‌పై సెల్జీన్‌తో ఉన్న పేటెంట్‌  వివాదాన్ని పరిష్కరించుకోవడం తో శుక్రవారం కంపెనీ షేరు వెలుగులో నిలిచింది. 2022, మార్చి తర్వాత పరిమిత పరిమాణంలో జనరిక్‌ లెనలిడోమైడ్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీ్‌సకు సెల్జీన్‌ అనుమతి ఇచ్చింది. 2026, జనవరి నుంచి పరిమాణ పరిమితి లేకుండా విక్రయించవచ్చు. దీని వల్ల కంపె నీ అమెరికా ఆదాయం, నగదు ప్రవాహంపై సా నుకూల ప్రభావం ఉండగలదని  మార్కెట్‌ భావిస్తోంది. \


అమెరికాలో లెనలిడోమైడ్‌  విక్రయాలు 800 కోట్ల డాలర్ల మేరకు ఉంటాయని అంచనా. సెల్జీన్‌ ‘రెవ్లీమిడ్‌’ బ్రాండ్‌తో ఈ ఔషధాన్ని విక్రయిస్తోంది. రష్యాకు చెందిన  స్పుత్నిక్‌ వీ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భారత్‌లో మూడోదశ క్లినికల్‌ పరీక్షలు చేయడానికి

రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా కంపెనీ షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత భారత్‌లో సరఫరా చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ 10 కోట్ల స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ డోసులను పొందనుంది.  


Updated Date - 2020-09-19T05:50:35+05:30 IST