Abn logo
Oct 21 2021 @ 23:29PM

100 శాతం మొక్కలను కాపాడాలి

పండ్ల తోటను పరిశీలిస్తున్న పీడీ యధుభూషణ్‌రెడ్డి

డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి 

వల్లూరు, అక్టోబరు 21: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకం చేపట్టి వాటిని 100 శాతం కాపాడాలని డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి తెలిపారు. గోటూరు గ్రామం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం లింగాయపల్లెలోని రమణయ్య పొలంలో పెంచిన జామ చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రావాల్సిన డబ్బులను ఎప్పటికప్పుడే పేమెంట్‌ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పుడైతే ఈ పథకం ద్వారా వారికి డబ్బులు పడతాయో మిగతా రైతులు కూడా ఈ మొక్కలు నాటే పనికి శ్రీకారం చుడతారని చెప్పారు. ఆయన వెంట ఏపీడీ సోమశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో జుబేదా, ఏపీవో పార్థసారధి, కోర్సు డైరెక్టర్‌ సుబ్బయ్య, టీఏలు రెడ్డయ్య, శ్రీను, ఫీల్డు అసిస్టెంట్లు ఓబయ్య, భాస్కర్‌, పావని, రైతులు పాల్గొన్నారు. 

వ్యాక్సిన్‌ను పరిశీలించిన పీడీ 

మండల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ కింద గ్రామాల్లో జరుగుతున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ను స్థానిక వైద్యులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. మండల వ్యాప్తంగా డోర్‌ టు డోర్‌ స్థానిక వైద్య సిబ్బంది వెళుతున్నారని స్థానిక వైద్యులు ప్రసన్నలక్ష్మీ, మేరీ సుజాత తెలిపారు.