నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:53:52+05:30 IST

: డిసెంబరు చివరి వరకు 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ పూర్తికి

నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

   కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 

నల్లగొండ, డిసెంబరు 1: డిసెంబరు చివరి వరకు 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ పూర్తికి సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి డ్రైవ్‌ను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 91శాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన ట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. మొదటి డోస్‌ వేసుకొని రెండవ డోస్‌ కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి ఈ నెలా ఖరిలోగా పూర్తి చేయాలన్నారు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కోసం సబ్‌ సెంటర్‌, గ్రామ హ్యాబిటేషన్ల వారీగా మ్యాపింగ్‌ చేస్తూ సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి విభజన చేసి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. డిప్యూటీ వైద్య అధికారులు తమ పరిధిలోని డాక్టర్లతో గురువారం సమావేశాలను ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి లక్ష్యం నిర్ణయించాలన్నారు. డీఎంహెచ్‌వో కొండల్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 12,07,615 మంది లక్ష్యానికి ఇప్పటి వరకు 10,86,314 మందికి మొదటి డోస్‌ పూర్తయిందని తెలిపారు. 3,96,415 మందికి రెండో డోస్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిప్యూటీ వైద్య అధికారులు వేణుగోపాల్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:53:52+05:30 IST