100 కోట్లమంది విద్యార్థులపై కరోనా ప్రభావం: ఐరాస

ABN , First Publish Date - 2020-08-05T03:22:20+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవితవ్యంపై ప్రభావం చూపిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

100 కోట్లమంది విద్యార్థులపై కరోనా ప్రభావం: ఐరాస

స్టాక్‌హోం: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవితవ్యంపై ప్రభావం చూపిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సుమారు 160 దేశాల్లో స్కూళ్లను కరోన మహమ్మారి కారణంగా మూసేశారని, ఈ నిర్ణయం కనీసం 100 కోట్లమంది విద్యార్థులపై ప్రభావం చూపిందని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. అలాగే 4కోట్లపైగా పిల్లలు ప్రీ-స్కూల్ విద్యను మిస్ అయ్యారని ఆయన చెప్పారు. ‘దీని వల్ల మానవ మేధస్సు చాలా నష్టపోయింది. ఈ తరం గొప్ప విపత్తును ఎదుర్కొన్నట్లు అయింది. దీని వల్ల మానవుల ప్రగతి దెబ్బతిన్నట్లే’ అని గుటెరస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-05T03:22:20+05:30 IST