భారత్‌‌కు వెళ్లాలని ఉంది.. 100 ఏళ్ల బ్రిటన్ మాజీ ఆర్మీ అధికారి కోరిక!

ABN , First Publish Date - 2020-05-17T18:47:50+05:30 IST

ఆయన పేరు టామ్ మూర్. బ్రిటన్ మాజీ ఆర్మీ అధికారి. 1940ల్లో భారత్, బర్మా దేశాల్లో ఇంజినీర్‌గా సేవలందించారు. ఇటీవలే తన 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల వయసులోనూ ఆయన కరోనా కట్టడి కోసం వినూత్నంగా విధులు సేకరించారు.

భారత్‌‌కు వెళ్లాలని ఉంది.. 100 ఏళ్ల బ్రిటన్ మాజీ ఆర్మీ అధికారి కోరిక!

లండన్: ఆయన పేరు టామ్ మూర్. బ్రిటన్ మాజీ ఆర్మీ అధికారి. 1940ల్లో భారత్, బర్మా దేశాల్లో ఇంజినీర్‌గా సేవలందించారు. ఇటీవలే తన 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల వయసులోనూ ఆయన కరోనా కట్టడి కోసం వినూత్నంగా విధులు సేకరించారు. ఆ రోజున తన ఇంటిలోని ఉద్యానవనం చుట్టూ వంద రౌండ్లు నడిచి 19 మిలియన్ పౌండ్ల విరాళం సేకరించారు. దీంతో ఆయన బ్రిటన్‌ మొత్తంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. అయితే తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు మళ్లి భారత్‌లో పర్యటించాలని ఉన్నట్టు తెలిపారు. కరోనా ఆంక్షలు ఎత్తేశాక భారత్‌లో పర్యటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా.. గత నెలలో తన 100 వ పుట్టిన రోజు సందర్భంగా కరోనా కట్టడి కోసం 19 మిలియన్ పౌండ్లు సేకరించినందుకు గాను ఆయన్ను స్వయంగా బ్రిటన్ రాకుమారుడు విలియమ్ ప్రశంసించారు.  

Updated Date - 2020-05-17T18:47:50+05:30 IST