1,01,318 ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్లు

ABN , First Publish Date - 2021-01-16T05:42:50+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఓటర్లు గణనీయంగా పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం తుది జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు.

1,01,318 ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్లు

  • ఓటర్ల తుది జాబితా విడుదల 
  • రంగారెడ్డిజిల్లాలో 30,97,644 మంది ఓటర్లు
  • మేడ్చల్‌ జిల్లాలో  25,40,313  ఓటర్లు
  • వికారాబాద్‌లో  8,98,423 ఓటర్లు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఓటర్లు గణనీయంగా పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం తుది జాబితాను శుక్రవారం అధికారులు  విడుదల చేశారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో గతంలో కంటే 1,01,318 మంది ఓటర్లు పెరిగారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 16వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసిన అధికారులు సవరణలు చేపట్టారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం  రంగారెడ్డి జిల్లాలో మొత్తం 30,97,644 మంది ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 25,40,313 మంది, వికారాబాద్‌జిల్లాలో మొత్తం 8,98,423 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో కంటే రంగారెడ్డిజిల్లాలో 43,306 మంది ఓటర్లు పెరిగారు. అలాగే మేడ్చల్‌జిల్లాలో 56,366 మంది, వికారాబాద్‌ జిల్లాలో 1646 మంది ఓటర్లు పెరిగారు. రంగారెడ్డిజిల్లాలో మొత్తం 30,97,644 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 16,13,625 మంది కాగా మహిళా ఓటర్లు 14,83,650 మంది, ట్రాన్స్‌జెండర్లు 369 మంది ఉన్నారు. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 25,40,313 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 13,22,485 మంది ఉన్నారు. మహిళలు 12,17,545 మంది కాగా ట్రాన్స్‌జెండర్లు 283మంది ఉన్నారు. వికారాబాద్‌జిల్లాలో మొత్తం 8,98,423 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 4,49,641 మంది కాగా మహిళలు 4,48,759 మంది, ట్రాన్స్‌జెండర్లు 23 మంది ఉన్నారు. 

Updated Date - 2021-01-16T05:42:50+05:30 IST