కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ సలహా ఇదే!

ABN , First Publish Date - 2020-04-10T09:45:46+05:30 IST

ధైర్యం, విశ్వాసంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధ్యమని 103 ఏళ్ల బామ్మ నిరూపించింది. కొవిడ్‌-19 కారణంగా మృత్యు ముఖం దాకా వెళ్లిన ఇటలీకి చెందిన ఈ బామ్మ ఆత్మ విశ్వాసంతో కోలుకుంది. జ్వరంతో వారం రోజుల పాటు మంచానికే పరిమి

కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ సలహా ఇదే!

రోమ్‌, ఏప్రిల్‌ 9: ధైర్యం, విశ్వాసంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధ్యమని 103 ఏళ్ల బామ్మ నిరూపించింది. కొవిడ్‌-19 కారణంగా మృత్యు ముఖం దాకా వెళ్లిన ఇటలీకి చెందిన ఈ బామ్మ ఆత్మ విశ్వాసంతో కోలుకుంది. జ్వరంతో వారం రోజుల పాటు మంచానికే పరిమితమైన అడా జానుస్సో అనే వృద్ధురాలు ఎలాంటి ఆహారం తీసుకోలేకపోయింది. దీంతో డాక్టర్లు ఆమెకు ద్రవాహారం అందించారు. అయితే, తరచూ మగతలోకి వెళ్లిపోయే ఆమె ద్రవాహారాన్ని సైతం సరిగ్గా తీసుకోలేకపోవడంతో తాము ఆశలు వదులుకున్నామని వృద్ధురాలి కుటుంబ వైద్యుడు తెలిపారు. కానీ, వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా కళ్లు తెరిచిన జానుస్సో బెడ్‌పై కూర్చుందని, కాసేపట్లోనే కిందికి దిగి నడవడంతో అందరూ ఆశ్చర్యపోయారన్నారు. ‘నీవు ఎలా కోలుకున్నావు’ అని వైద్యుడు ప్రశ్నించగా.. ధైర్యం, బలం, విశ్వాసం వల్లేనని వృద్ధురాలు సమాధానమిచ్చింది.


Updated Date - 2020-04-10T09:45:46+05:30 IST