కరోనా ఎఫెక్ట్.. 104 విమానాలు రద్దు

ABN , First Publish Date - 2021-05-11T14:44:09+05:30 IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమ లుచేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా మీనాంబాక్కంలోని స్వదేశీ, విదేశీ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో 104 విమానాలు రద్ద య్యాయి. విదేశీ విమా

కరోనా ఎఫెక్ట్.. 104 విమానాలు రద్దు


చెన్నై: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమ లుచేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా మీనాంబాక్కంలోని స్వదేశీ, విదేశీ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో 104 విమానాలు రద్ద య్యాయి. విదేశీ విమానాశ్రయం నుంచి 10 విమానాల మాత్రమే  వెళ్లాయి. చెన్నై విమానాశ్రయానికి విదేశాల నుంచి ‘వందే భారత్‌’, ప్రత్యేక విమానాలు  కలిపి ప్రతిరోజూ పదికి పైగా వస్తుంటాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రారంభ మైన సోమవారం మూడు వందే భారత్‌, ఏడు ప్రత్యేక ప్రత్యేక విమానాలు  మొత్తం 10 మాత్రమే వచ్చాయి. అలాగే, స్వదేశీ విమానాశ్రయం నుంచి  50 విమానాలు బయల్దేరగా, వివిధ నగరాల నుంచి 49 విమానాలు వచ్చాయి. వచ్చిన విమానాల్లో 2 వేల మంది, నగరం నుంచి వెళ్లిన విమానాల్లో 4.500 మంది ప్రయాణించారు. వీరిలో కూడా వలస కార్మికులు 2 వేల మంది ఉన్నారు. స్వదేశీ విమానాశ్రయానికి మూడు నెలల క్రితం 270 విమానాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం కరోనా రెండవ దశ వ్యాప్తితో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. సోమవారం నగరం నుంచి బయల్దేరాల్సిన 50, నగరాల నుంచి రావాల్సిన 54 మొత్తం 104 విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులు లేకపోవడంతో రెండు మూడు విమానాల్లోని ప్రయాణికులను ఒకే విమానంలో పంపించారు. చెన్నై నుంచి బెంగుళూరు లేదా హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీకి, కొచ్చిన్‌ మీదుగా ముంబైకి విమానాలు నడిపారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గే అవకాశముండడంతో విమానాల సంఖ్య కూడా తగ్గే అవకాశ ముందని అధికారులు తెలిపారు.


Updated Date - 2021-05-11T14:44:09+05:30 IST