ఆగిన పసికందు గుండె.. ప్రాణం పోసిన 108 సిబ్బంది

ABN , First Publish Date - 2021-07-28T15:02:29+05:30 IST

గుండె కొట్టుకోక సీరియస్ కండిషన్‎లో ఉన్న మూడు రోజుల పసికందుకు మళ్లీ ప్రాణం పోశారు 108 అంబులెన్స్ సిబ్బంది.

ఆగిన పసికందు గుండె.. ప్రాణం పోసిన 108 సిబ్బంది

కరీంనగర్: గుండె కొట్టుకోక సీరియస్ కండిషన్‎లో ఉన్న మూడు రోజుల పసికందుకు మళ్లీ ప్రాణం పోశారు 108 అంబులెన్స్ సిబ్బంది. సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ స్పందన కలిగేట్టు చేసి చిన్నారిని బతికించారు. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళ మూడు రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అయితే.. అనార్యోగం కారణంగా బాబును మంగళవారం కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో అప్పటికే పసికందు పరిస్థితి విషమించింది. వెంటనే డాక్టర్లు వరంగల్ తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‎లో పసికందును వరంగల్ తరలిస్తుండగా గుండె ఆగిపోయింది. దీంతో 108 సిబ్బంది సమయానుకూలంగా వ్యవహరించి ప్రాణాపాయం నుంచి చిన్నారిని తప్పించారు. సీపీఆర్ విధానంతో  చెస్ట్ కంప్రెషన్ ద్వారా హృదయ స్పందన కలిగేట్టు చేశారు. హార్ట్ బీట్ నార్మల్ స్థితిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ పసికందును ఆస్పత్రిలో  చేర్చి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2021-07-28T15:02:29+05:30 IST