108 వాహనంలో ప్రసవం

ABN , First Publish Date - 2020-08-14T08:54:31+05:30 IST

ఓ గర్భిణి 108 వాహనంలోనే ప్రసవించిన సంఘటన గురువారం చౌడేపల్లె మండలంలో జరిగింది. గజ్జలవారిపల్లెకు చెందిన గర్భిణి హేమప్రణతికి ప్రసవ నొప్పులు రావటంతో కుటుంబీకులు 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆస్పత్రి

108 వాహనంలో ప్రసవం

చౌడేపల్లె, ఆగస్టు 13: ఓ గర్భిణి 108 వాహనంలోనే ప్రసవించిన సంఘటన గురువారం చౌడేపల్లె మండలంలో జరిగింది. గజ్జలవారిపల్లెకు చెందిన గర్భిణి హేమప్రణతికి ప్రసవ నొప్పులు రావటంతో కుటుంబీకులు 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా బోయకొండ సమీపానికి వెళ్లేసరికి ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. ఈఎంటీ గణేష్‌ వాహనాన్ని నిలిపి సాధారణ కాన్పు చేయగా ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సిబ్బంది తల్లీబిడ్డను మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలిచారు. 

Updated Date - 2020-08-14T08:54:31+05:30 IST