Abn logo
Sep 28 2021 @ 22:32PM

108 ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న 108 అంబులెన్స్‌

ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్‌ 

నాయుడుపేట, సెప్టెంబరు 28 : 108లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్ల న్యాయపరమైన కోర్కెలు తీర్చాలని నాయుడుపేటకు చెందిన 108 అంబులెన్స్‌ సర్వీసెస్‌ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, బల్లి కిరణ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అమరావతిలో మంగళవారం వినతిపత్రం  అందజేశారు. 108లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసెస్‌ వెయిటేజ్‌ అమలు చేయాలని కోరారు. గతంలోని బకాయిలను అందజేయాలన్నారు . ఆయన వెంట ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌, కోశాధికారి శ్రీనివాస్‌  ఉన్నారు.