అతిపెద్ద శివ‌లింగ ఆల‌యానికి లాక్‌డౌన్ ఆటంకాలు

ABN , First Publish Date - 2020-06-29T15:37:05+05:30 IST

జార్ఖండ్ రాజధాని రాంచీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారిబాగన్ వద్ద నిర్మిత‌మైన 108 అడుగుల ఎత్త‌యిన‌ శివలింగ ఆలయం ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యింది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ప్రారం‌భోత్స‌వ...

అతిపెద్ద శివ‌లింగ ఆల‌యానికి లాక్‌డౌన్ ఆటంకాలు

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారిబాగన్ వద్ద నిర్మిత‌మైన 108 అడుగుల ఎత్త‌యిన‌ శివలింగ ఆలయం ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యింది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ప్రారం‌భోత్స‌వ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. ఈ ఆలయం 2011 నుంచి నిర్మిత‌మవుతోంది. ఇది జార్ఖండ్‌లో అత్యంత ఎత్త‌యిన శివ‌లింగంగా గుర్తింపుపొందింది. ఈ ఆలయాన్నితొలుత ఏప్రిల్ 24 న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఆ సమయంలో లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌టంతోపాటు సామాజిక దూరాన్ని పాటించాల‌నే నిబంధ‌న‌ల కార‌ణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాగా ఈ శివ‌లింగం భ‌క్తుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ శివలింగం ద‌గ్గ‌ర‌ ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా శివ‌లింగంపై పాలు, నీరుతో కూడిన అభిషేకం జ‌రుగుతుంది. వచ్చే ఏడాది ఈ ఆల‌యాన్ని ప్రారంభించాల‌ని అల‌య క‌మిటీ నిర్ణ‌యించింది. 

Updated Date - 2020-06-29T15:37:05+05:30 IST