Abn logo
Sep 25 2021 @ 23:55PM

10,993 లీటర్ల సారా ధ్వంసం

నవిరికాలనీ సమీపంలో సారా క్యాన్లను ధ్వంసం చేస్తున్న సిబ్బంది

పార్వతీపురం: ఇటీవల కాలంలో పట్టుబడిన 10,993 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్టు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర తెలిపారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ చంద్రరావు, ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు పార్వతీపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.సుధాకర్‌ ఆధ్వర్యంలో ఇటీవల 102 కేసుల్లో పట్టుబడిన 10,993 లీటర్ల సారాను పట్టణ శివారు ప్రాంతమైన నవిరికాలనీ సమీపంలోని ఎఫ్‌సీ గోదాం పాతరోడ్డులో ధ్వంసం చేసినట్టు చెప్పారు.