Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంత పని చేశావు తల్లీ.. భర్తతో గోడవ పడితే మాత్రం ఇంత ఘోరానికి పాల్పడాలా..? రెండున్నరేళ్ల కొడుకు.. 11 నెలల కూతురితో సహా..

దేశంలో గృహ కలహాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇవి హత్యలు, ఆత్మహత్యల వరకూ కూడా దారి తీస్తున్నాయి. ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఝాన్సీకి చెందిన ఒక మహిళ తన 11 ఏళ్ల కుమార్తెను, రెండున్నరేళ్ల కొడుకును సజీవ దహనం చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలున్నాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మూడు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన చిర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నద్సియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన మహేంద్ర రాజపూత్ తండ్రి రామ్‌స్వరూప్ ఇటీవలే కన్నుమూశాడు. తండ్రి పదవ రోజు కార్యక్రమాలకు మహేంద్ర తన కుమారుడు అనిల్‌ను తీసుకుని చిర్గావ్ వెళ్లాడు. 

ఇంటిలో అతని భార్య అనిత(26) కుమారుడు అర్పిత్, కుమార్తె గౌరి ఉన్నారు. ఆదివారం సాయంత్రం 3.30 గంట సమయంలో మహేంద్ర ఇంటి నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. వెంటనే అక్కడకు వెళ్లారు. అయితే ఆ ఇంటి తలుపు లోపలి  నుంచి గడియపెట్టివుంది. దీంతో వారంతా తలుపు తీయాలని కోరినా, ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో వారు తలుపులు బద్దలు కొట్టారు. లోపల అనిత మృతదేహం ఉరితాడుకు వేలాడుతోంది. ఇద్దరి పిల్లల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. చిర్గావ్ పోలీస్ స్టేషన్ ఎస్ఓ దేవేంద్ర ద్వవేది మాట్లాడుతూ తమకు ఆదివారం సాయత్రం ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిందని, వెంటనే తాము అక్కడకు చేరుకున్నామన్నారు. అదే సమయంలో మృతురాలి పుట్టింటివారు అక్కడికి వచ్చారని, గృహ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగివుంటుందని వారు తెలిపారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement