హిందూపురంలో ఉధృతం

ABN , First Publish Date - 2020-05-22T09:53:12+05:30 IST

పట్టణంలో కరోనా వైరస్‌ రోజురోజుకు ఉధృతం అవుతూనే ఉంది.

హిందూపురంలో ఉధృతం

తాజాగా మరో 11 మందికి కరోనా పాజిటివ్‌ 

ఆందోళనలో పట్టణ ప్రజలు.. 

నత్తనడకన కొవిడ్‌-19 ఆసుపత్రి


హిందూపురం, మే 21 : పట్టణంలో కరోనా వైరస్‌  రోజురోజుకు ఉధృతం అవుతూనే ఉంది. తాజాగా  గురు వారం పట్టణంలోని రహమత్‌పురం, కంసలపేట, ముక్కి డిపేట, మోడల్‌కాలనీ, జాపూజీనగర్‌, కెబసవనపల్లిలో మరో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సేకరించిన టెస్టింగ్‌ బ్లడ్‌ శాంపిళ్లలో ఇంకా భారీగా కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. పట్టణంలో కరోనా బాధితుల ను ఐసోలేషన్‌కు తీసుకెళ్లడం, పాజిటివ్‌ కాంటాక్ట్‌ వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, టెస్టింగ్‌ శాంపిళ్ల సేక రణ, రెడ్‌జోన్లలో ప్రజలను నిర్బంధం చేయడంలోనే అధి కార యంత్రాంగం ప్రతిరోజు గడపాల్సివస్తోంది. శాంపిళ్లు తీసే కొద్ది కరోనా వెలుగుచూస్తున్న నేపథ్యంలో పట్టణంలో వైరస్‌ ప్రజలతో సహజీవనం చేస్తున్నట్లు కన్పిస్తోంది.  పట్టణంలో జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేసే పనులు కొనసా....గుతూ నే ఉన్నాయి. 


 తగ్గిన టెస్టింగ్‌ శాంపిళ్లు 

పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ దాటి సా మాజిక వ్యాప్తి దశలోకి వెళ్లడంతో వైద్యఆరోగ్యశాఖ కంటై న్మెంట్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి టెస్టింగ్‌ శాంపిళ్లు భారీగా సేకరించారు. ప్రధానంగా 60 ఏళ్లుదాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడు తున్న వారితోపాటు ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా చిన్న జర్వం ఉన్నవారి నుంచి రక్త నమూనాలను తీసి కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నారు. ఇలా ప్రతి రోజు 300లకుపైగా శాంపిళ్లను గత పది రోజులుగా సేక రించారు. ఈ ఫీవర్‌ క్లినిక్‌లతోపాటు పాజిటివ్‌ కాంటాక్ట్‌ నుంచి కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టెస్టింగ్‌ శాంపిళ్ల నుంచే కేసుల సంఖ్య పెరు గుతున్న నేపథ్యంలో నాలుగు రోజులుగా టెస్టింగ్‌ శాంపిళ్ల సేకరణ తగ్గించారు.


టెస్టింగ్‌ శాంపిళ్ల సంఖ్య పెంచడం తోనే కరోనా లక్షణాలు లేకుండానే కేసులు పెరుగుతు న్నట్లు తెలుస్తోంది.  ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు హిందూపురంలో టెస్టింగ్‌ శాంపిళ్లు తగ్గించి ఫీవర్‌ క్లినిక్‌లో ప్రతి రోజు వందలోపే సేకరణ చేస్తున్నట్లు తెలు స్తోంది. కేసులు పెరుగుదల, కాంటాక్ట్‌ అనుమానితుల్ని క్వారంటైన్‌కు తరలింపులో ఇబ్బందుల నేపథ్యంలో అధికా ర యంత్రాంగం టిస్టింగ్‌ శాంపిళ్ల సేకరణకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2020-05-22T09:53:12+05:30 IST