పొద్దున్నే నలుగురు విద్యార్థులు.. క్లాసులోకి వెళ్లకుండా నేరుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి చెప్పిన విషయం విని షాక్.. వెంటనే..

ABN , First Publish Date - 2021-11-27T18:09:04+05:30 IST

ఎప్పటిలాగానే ఆ నలుగురు విద్యార్థులు శుక్రవారం ఉదయం పాఠశాలకు బయల్దేరారు.. పాఠశాల దగ్గరకు వచ్చేశారనగా

పొద్దున్నే నలుగురు విద్యార్థులు.. క్లాసులోకి వెళ్లకుండా నేరుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి చెప్పిన విషయం విని షాక్.. వెంటనే..

ఎప్పటిలాగానే ఆ నలుగురు విద్యార్థులు శుక్రవారం ఉదయం పాఠశాలకు బయల్దేరారు.. పాఠశాల దగ్గరకు వచ్చేశారనగా కొంత మంది దుండగులు ఆ నలుగురిలో ఒక బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు.. ఇంతలో పక్కనే ఉన్న బాలిక తన స్నేహితురాలి చేయి పట్టుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది.. భయపడిన దుండగులు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. అనంతరం ఆ విద్యార్థులు పరిగెత్తుకుంటూ స్కూలు ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పారు.. 


రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఖుషీ (11), జిమిలి (11), కిరణ్ (8), శ్యామ్ సింగ్ (5) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. శుక్రవారం ఉదయం వారు పాఠశాలకు వెళ్తుండగా కారులో కొందరు దుండగులు వచ్చి ఖుషీని కారులోకి లాగేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న జిమిలి తన స్నేహితురాలని గట్టిగా పట్టుకుని అరవడం మొదలుపెట్టింది. ఖుషీని కారులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి చేతిని జిమిలి కొరికేసింది. దీంతో దుండగులు ఖుషీని అక్కడే వదిలేసి పరారయ్యారు. జిమిలి, ఖుషీ కారు నెంబర్‌ను కూడా నోట్ చేసుకున్నారు. 


వెంటనే స్కూలుకు చేరుకుని ప్రిన్సిపాల్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికల నుంచి వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. కాగా, జిమిలి ప్రదర్శించిన ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2021-11-27T18:09:04+05:30 IST