Abn logo
Apr 11 2021 @ 09:22AM

కరోనా ఆంక్షలు ఉన్నా.. రహస్యంగా వ్యాపారాలను నడుపుతున్న రెస్టారెంట్లు

పారిస్: ఫ్రాన్స్‌ను కరోనా మమమ్మారి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం మరోమారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆంక్షల్లో భాగంగా రెస్టారెంట్లు కేవలం ఆన్‌లైన్ డెలివరీలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం అధికారుల కళ్లుగప్పి కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆంక్షలను పాటించని రెస్టారెంట్లపై, కస్టమర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.


పారిస్‌లోని క్లాన్‌డెస్టైన్ రెస్టారెంట్‌లో గత శుక్రవారం 119 మందికి పైగా కస్టమర్లు డిన్నర్ చేసేందుకు వెళ్లడంతో వారందరికి అధికారులు భారీ జరిమానాను విధించారు. అంతేకాకుండా కస్టమర్లను ఆహ్వానించినందుకు రెస్టారెంట్ మేనేజర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా ఇప్పటికే అనేక రెస్టారెంట్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ అనేక మంది నిరసన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.  కాగా.. ఫ్రాన్స్ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 50,23,785 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 98,602 మంది మృత్యువాతపడ్డారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement