110 ఏళ్ల ఈ తాత.. కరోనా విజేత

ABN , First Publish Date - 2021-05-13T18:43:57+05:30 IST

ఈయన పేరు శ్రీరామనంద తీర్థ. వయసు 110 ఏళ్లు.

110 ఏళ్ల ఈ తాత.. కరోనా విజేత

ఈయన పేరు శ్రీరామనంద తీర్థ. వయసు 110 ఏళ్లు. కరోనా వైరస్‌ సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావుతో పాటు ప్రత్యేక వైద్యుల బృందం వారం రోజులుగా ఆయనకు చికిత్స అందించడంతో కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లో తాతను డిశ్చార్జి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వృద్ధుడు కీసరలోని ఓ అనాథ ఆశ్రమం నుంచి వచ్చి గాంధీలో చేరినట్టు వెల్లడించారు. ( అడ్డగుట్ట - ఆంధ్రజ్యోతి) 


Updated Date - 2021-05-13T18:43:57+05:30 IST