ప్రధాన మద్దతు 11300 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-09-21T06:24:16+05:30 IST

నిఫ్టీ గత వారం 11600 వెళ్లి కరెక్షన్‌కు లోనైనా కనిష్ఠ స్థాయిల్లో రికవరీతో చివరికి 40 పాయింట్ల లాభంతో ముగిసింది. కాని గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్యన క్లోజ్‌ కావడం ట్రెండ్‌లో అనిశ్చితిని తెలియచేస్తోంది...

ప్రధాన మద్దతు 11300 -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం 11600 వెళ్లి కరెక్షన్‌కు లోనైనా కనిష్ఠ స్థాయిల్లో రికవరీతో చివరికి 40 పాయింట్ల లాభంతో ముగిసింది. కాని గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్యన క్లోజ్‌ కావడం ట్రెండ్‌లో అనిశ్చితిని తెలియచేస్తోంది. మరింత కన్సాలిడేషన్‌కే ఆస్కారం ఉంది. గత నాలుగు వారాలుగా తీవ్రమైన సైడ్‌వేస్‌ ధోరణిలో ట్రేడవుతోంది. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉంది. అమెరికన్‌ స్టాక్‌మార్కెట్‌లో శుక్రవారం ఏర్పడిన రియాక్షన్‌ కారణంగా ఈ వారం స్వల్ప రియాక్షన్‌ చవి చూడవచ్చు. దిగువన బలమైన మద్దతు స్థాయిలున్నందు వల్ల రికవరీకి కూడా ఆస్కారం ఉంది. ప్రస్తుతం ప్రధాన 20 డిఎంఏ కన్నా స్వల్పంగా పైన ఉంది. 


బుల్లిష్‌ స్థాయిలు : 11500 కన్నా పైన ముగిస్తే ట్రెండ్‌లో సానుకూలత ఏర్పడుతుంది. ప్రధాన నిరోధం 11600. ఇదే కొద్ది రోజుల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి కావడం వల్ల స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. మరో ప్రధాన నిరోధం 11800. 

బేరిష్‌ స్థాయిలు : ప్రధాన మద్దతు స్థాయి 11380 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 11300. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌ తప్పదు. 

బ్యాంక్‌ నిఫ్టీ : రియాక్షన్‌కు గురైతే 21700 వద్ద మద్దతు తీసుకోవాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌ ఏర్పడుతుంది. రికవరీ బాట పడితే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 22300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. 

పాటర్న్‌ : మరింత అప్‌ట్రెండ్‌ కోసం 11600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ తప్పనిసరి. 11300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌ తప్పదు. కాని ఇది కొంత దూరంగా ఉన్నందు వల్ల తక్షణ ముప్పు లేదు. 

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.


ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.368) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.365 ఎగువన కొనుగోలు మొదటి నిరోధం రూ.380 రెండో నిరోధం రూ.400

రూ.358 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.340 రెండో మద్దతు రూ.320


సోమవారం స్థాయిలు

నిరోధం : 11510, 11560  

మద్దతు : 11440, 11380


Updated Date - 2020-09-21T06:24:16+05:30 IST