కువైట్ నుంచి విజయవాడకు చేరిన‌ 115 మంది తెలుగువారు

ABN , First Publish Date - 2020-07-08T20:57:59+05:30 IST

ప్రపంచంలో మ‌హ‌మ్మారి కరోనా విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అన్ని దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే.

కువైట్ నుంచి విజయవాడకు చేరిన‌ 115 మంది తెలుగువారు

ప్రపంచంలో మ‌హ‌మ్మారి కరోనా విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై అన్ని దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో కువైట్ నుంచి స్వరాష్ట్రాలకు వెళ్లాలంటే విమానాలు లేక గత ఆరు నెలల నుండి ఆరోగ్య సమస్యలు,  విజిట్ వీసా గడువు ముగియడం, ఉద్యోగాలు తొలగిపోవడంతో ఎంతోమంది భారతదేశానికి వెళ్లడానికి ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ చేసుకున్నారు. అయినా కూడా వందే భారత్ మిషన్ భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విమానాలు కేటాయించలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాగైనా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని స్వ‌రాష్ట్రానికి తీసుకురావడానికి జీ సేవ కువైట్, జనసేన ఎన్నారై సేవాసమితి ఆధ్వర్యంలో జూలై 7వ తేదీన విజయవాడకు చార్టర్డ్ ఫ్లైట్ సిద్ధం చేసింది. ఈ విమానంలో 115 మంది తెలుగువారిని గన్నవరం విమానాశ్ర‌యానికి జూలై 6న పంపించడం జరిగింది.


గర్భిణీలు, అనారోగ్య వ్యక్తి, వీసా గడువు ముగిసిన  వారు, పరీక్షలకు హాజరు కావడానికి భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకునే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ఏపీఎన్ఆర్‌టీ సభ్యులకు, ఇండియన్ ఎంబసీ అధికారులకు, తెలుగు సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావుకు, కువైట్ వైఎస్ఆర్‌సీపీ కన్వీనర్ ముమ్మిడి బాలరెడ్డికి, క్యూ గో ట్రావెల్ యాజమాన్యానికి,  కువైట్ ఎయిర్ వేస్ అధికారులకు మ‌రియు ఈ కార్యక్రమంలో అహర్నిశలు కృషి చేసిన షేక్ మహమ్మద్ గౌస్,  షేక్ కరీముల్లా, ఖాజా, దర్బార్, నిజాం సాహెబ్ ఆశిష్ , అబూలకు, జనసేన ఎన్నారై సేవా సమితి అధ్యక్షుడు రామ చంద్ర నాయక్, ఉపాధ్యక్షుడు పగడాల అంజన కుమార్ ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు.


Updated Date - 2020-07-08T20:57:59+05:30 IST