నారాయణపేటలో ఒకటే కేసు

ABN , First Publish Date - 2020-10-25T05:59:14+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. తాజాగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా

నారాయణపేటలో ఒకటే కేసు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 116 మందికి పాజిటివ్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/నారాయణపేట క్రైం/నాగర్‌కర్నూల్‌ క్రైం/వనపర్తి అక్టోబరు 24 : కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. తాజాగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం 116 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం 30 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో జిల్లా కేంద్రంలో 13 మందికి, జిల్లాలోని వివిధ మండలాల్లో 17 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలోనే ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మిగిలిన తొమ్మిది కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ మండలంలో తొమ్మిది మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 31 కేసులు ఇతర మండలాల్లో వచ్చాయి.
  • వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా వనపర్తి మండలంలో 17 మందికి వైరస్‌ సోకగా, మిగిలిన 13 కేసులు ఇతర మండలాల్లో వచ్చాయి.
  • నారాయణపేట జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైంది.

Updated Date - 2020-10-25T05:59:14+05:30 IST