స్టీల్‌ప్లాంటు నుంచి 11,900 టన్నుల ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-06T09:09:04+05:30 IST

కరోనా రక్కసి ఊపిరి తీస్తున్న వేళ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాతో ఊపిరి పోస్తోంది. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ఇప్పటివరకు 11,900 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది

స్టీల్‌ప్లాంటు నుంచి 11,900 టన్నుల ఆక్సిజన్‌

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా రక్కసి ఊపిరి తీస్తున్న వేళ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాతో ఊపిరి పోస్తోంది. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ఇప్పటివరకు 11,900 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. ఇక్కడ ఐదు ఆక్సిజన్‌ యూనిట్లు ఉండగా.. అన్నింటిలోనూ పూరిస్థాయిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెల 13 నుంచి ఇప్పటివరకు 3,050 టన్నుల ఆక్సిజన్‌ను క్రయోజనిక్‌ ట్యాంకర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సరఫరా చేశారు. కొత్తగా నిర్మించిన మరో రెండు యూనిట్లు కూడా త్వరలో ఆపరేషన్‌లోకి వస్తాయని, వాటి ద్వారా అదనంగా రోజుకు 100 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయగలుగుతామని స్టీల్‌ప్లాంటు వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-05-06T09:09:04+05:30 IST