ప్రభుత్వ ఆసుపత్రిలో 12 ప్రసవాలు

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో 12 ప్రసవాలు
భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ప్రసూతివార్డు

భైంసా, జనవరి 26 : రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ఇక్కడి ఆసుపత్రిలో ఈ నెల లో  ఇప్పటి వరకు 134 ప్రసవాలు జరిగాయి. ఇందులో 44 సాధారణ ప్రసవాలు, 90 శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు జరిగాయి. వీటిల్లో 4 కోవిద్‌ పాజిటివ్‌ బారిన పడ్డ గర్బిణీల ప్రసవాలు కూడా ఉన్నాయి. ఇక మంగళ వారం మధ్యాహ్నం నుంచి  రాత్రి వరకు ఇక్కడి ఏరి యా ఆసుపత్రిలో 12 మంది  ప్రసవించారు. ఇందులో 2 సాధారణ ప్రసవాలు జరుగగా 10 శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు జరిగాయి. ఏరియా ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డా. పద్మావతిబోస్లే ఒక్కరే  ఈ ప్రసవాలు నిర్వహించారు.  


Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST