12 Express రైళ్లలో అన్‌రిజర్వుడ్‌ బోగీలు

ABN , First Publish Date - 2021-12-02T17:12:56+05:30 IST

ఈనెల 3వ తేదీ నుండి 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అన్‌రిజర్వుడు బోగీలతో నడుపనున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు ప్రక టించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో అన్‌ రిజర్వుడు బోగీలను తొలగించారు.

12 Express  రైళ్లలో అన్‌రిజర్వుడ్‌ బోగీలు

చెన్నై: ఈనెల 3వ తేదీ నుండి 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అన్‌రిజర్వుడు బోగీలతో నడుపనున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు ప్రక టించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో అన్‌ రిజర్వుడు బోగీలను తొలగించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అన్‌రిజర్వుడు బోగీలతో నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ మేరకు చెన్నై సెంట్రల్‌ - బెంగళూరు - చెన్నై సెంట్రల్‌ బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌ - కోయంబత్తూరు - చెన్నై సెంట్రల్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, విల్లుపురం - తిరుపతి- విల్లుపురం, చెన్నై సెంట్రల్‌ - తిరుపతి - చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌ -తిరుపతి - చెన్నై సెంట్రల్‌ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లలో అన్‌రిజర్వుడు బోగీలు ఏర్పాటు చేశారు. ఈ అన్‌రిజర్వుడు బోగీలలో ప్రయాణించేవారు సెకెండ్‌క్లాస్‌ ఛార్జీలను చెల్లించాల్సి వుంటుందని తెలిపారు.

Updated Date - 2021-12-02T17:12:56+05:30 IST