భారత్‌కు హెచ్చరిక! 12 నగరాలు నీట మునిగిపోయే అవకాశం.. నాసా అంచనా!

ABN , First Publish Date - 2021-08-11T01:08:56+05:30 IST

ఈ నివేదిక ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత్‌లోని స్థితిగతులపై అధ్యయనం జరిపింది. భారత్‌లోని 12 నగరాలు, టౌన్లు నీట మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.

భారత్‌కు హెచ్చరిక! 12 నగరాలు నీట మునిగిపోయే అవకాశం.. నాసా అంచనా!

న్యూఢిల్లీ: ప్రమాదం ముంచుకొస్తోంది.. ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయి. తీర ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. తుఫానులు, వడ గాల్పులు, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజల తీరులో మార్పు లేకపోవడంతో మానవాళి ప్రకృతి గీసిన లక్ష్మణరేఖను దాటే స్థితికి చేరుకుంటోంది. మరో ఇరవై ఏళ్లలో భూ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరగనున్నాయి. ఈ స్థితికి చేరుకుంటే..మనిషిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏంటి ఇదంతా.. అంటారా..? వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానల్(ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన 6వ అసెస్‌మెంట్ నివేదికకు సంక్షిప్త రూపం ఇది.


ఈ నివేదిక ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..సముద్రమట్టాల పెరుగుదలపై  అధ్యయనం జరిపింది. ఈ క్రమంలో భారత్‌లోని 12 నగరాలు, టౌన్లు నీట మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ శతాబ్దం చివరి కల్లా..  కాండ్లా, ఒఖా, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై వంటి మొత్తం 12 నగరాలు, టౌన్లు 2.7 అడుగుల లోతు నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Updated Date - 2021-08-11T01:08:56+05:30 IST