Abn logo
May 5 2021 @ 08:33AM

12 రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు... 81 శాతం కేసులు ఇక్కడే...

న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అత్య‌ధిక స్థాయిలో ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల‌లో 81 శాతం ఈ 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో క‌రోనా పరిస్థితులు కాస్త‌ మెరుగుపడుతున్నప్పటికీ, ఇప్ప‌ట్లో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గేలా క‌నిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం వ‌ర‌కూ మహారాష్ట్రలో రోజుకు కొత్త‌గా 60 వేలకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

సోమ‌వారం కొత్త‌గా 56 వేలకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అయితే మంగళవారం కేసుల సంఖ్య కాస్త త‌గ్గి, కొత్త‌గా 48,621 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో 44,438, ఉత్తరప్రదేశ్‌లో 29,052 కేసులు కొత్త‌గా నమోదయ్యాయి. దేశంలో ప్ర‌స్తుతం 34,47,133 కరోనా బాధితులు ఉన్నారని, వారు ఆసుప‌త్రులు లేదా ఇళ్ల వ‌ద్ద చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల‌లో ఇది 17 శాతం. కరోనా డెత్ రేటు 1.10 శాతంగా ఉంది. 

Advertisement
Advertisement
Advertisement