12 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-12-17T14:50:30+05:30 IST

కోతగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు పోక్సో చట్టం కింద అరెస్టయ్యాడు. నీలగిరి జిల్లా కోతగిరి ప్రభుత్వ పాఠశాలలో మురళిధరన్‌ (46) సోషల్‌ టీచర్‌గా

12 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు

                            - పోక్సో చట్టం కింద టీచర్‌ అరెస్టు


పెరంబూర్‌(చెన్నై): కోతగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు పోక్సో చట్టం కింద అరెస్టయ్యాడు. నీలగిరి జిల్లా కోతగిరి ప్రభుత్వ పాఠశాలలో మురళిధరన్‌ (46) సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతను విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుడి వేధింపుకు గురైన 12 మంది విద్యార్థినులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో, ఆయన సోలూరుమట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, కున్నూర్‌ డీఎస్పీ సురేష్‌, ఊటీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ కన్మణి, ఎస్‌ఐ షణ్ముగవేల్‌లు బుధవారం బాధిత 12 మంది విద్యార్థినులను విచారించగా, వారి ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతో, టీచర్‌ మురళిధరన్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Updated Date - 2021-12-17T14:50:30+05:30 IST