సడెన్‌గా ఎలుగుబంటి కనిపిస్తే.. ఈ అబ్బాయి ధైర్యానికి నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2020-05-27T04:05:18+05:30 IST

అలెజాండ్రో అనే ఓ 12 ఏళ్ల కుర్రాడు తన కుటుంబంతో కలిసి హైకింగ్‌కు వెళ్లాడు.

సడెన్‌గా ఎలుగుబంటి కనిపిస్తే.. ఈ అబ్బాయి ధైర్యానికి నెటిజన్లు ఫిదా!

ట్రెంటినో: అలెజాండ్రో అనే ఓ 12 ఏళ్ల కుర్రాడు తన కుటుంబంతో కలిసి హైకింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఫామిలీతో కలిసి అటూ ఇటూ తిరుగుతుండగా.. సడెన్‌గా అలెజాండ్రో వెనక ఉన్న కొన్ని పొదలు కదిలాయి. ఏంటా అని చూస్తే ఓ పెద్ద ఎలుగుబంటి బయటకొచ్చింది. దాన్ని చూడగానే అలెజాండ్రో ఫ్యామిలీ.. అతనికి ధైర్యం చెప్పింది. పరిగెత్తవద్దని, దానివైపు చూడకుండా నెమ్మదిగా వచ్చేయాలని అలెజాండ్రో తల్లి చెప్పింది. ఆ మాటలు విన్న అలెజాండ్రో మారుమాట్లాడకుండా ఎలుగుబంటి వైపు చూడకుండా నెమ్మదిగా పక్కకు వచ్చేశాడు. మధ్యలో ఓసారి ఎలుగు తన వెంటబడుతోందా? అని వెనక్కి చూశాడు. ఈ ఘటన ఇటలీలోని ట్రెంటినోలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లంతా అలెజాండ్రో ధైర్యాన్ని విపరీతంగా మెచ్చుకుంటున్నారు.



Updated Date - 2020-05-27T04:05:18+05:30 IST