Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంట్లో ఒంటరిగా బాధపడుతున్న కూతురిని అత్తయ్య ఇంటికి పంపించింది ఆ తల్లి.. అత్తయ్యతో ఆ బాలిక చెప్పిన విషయం విని షాక్!

ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటున్న 12 ఏళ్ల బాలికను చూసి తల్లికి అనుమానం వచ్చింది.. ఎంత అడిగినా ఆ బాలిక తల్లికి ఏమీ చెప్పలేదు.. దీంతో ఆ తల్లి తన కూతురిని బంధువుల ఇంటికి పంపింది.. అక్కడ ఆ బాలిక నోరు విప్పింది.. తనపై జరిగిన అత్యాచారం గురించి వెల్లడించింది.. ఇంట్లో ఎవరూ లేనపుడు ఎదురింటి అంకుల్ తనతో బలవంతంగా శృంగారం సాగించాడని చెప్పింది.. దీంతో కుటుంబ సభ్యులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. 


బరేలీకి చెందిన 12 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం ఒంటరిగా ఉన్నట్టు గమనించిన తరుణ్ అనే యువకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనలో తనే కుమిలిపోయింది. అనారోగ్యానికి గురైంది. నిద్రలో ఉలిక్కిపడి లేచేది. కూతురి సంగతి గమనించిన తల్లికి అనుమానం వచ్చింది. ఎంత అడిగినా తన తల్లికి ఆ బాలిక ఏమీ చెప్పలేదు. 


దీంతో ఆ తల్లి తన కూతురిని అత్తయ్య ఇంటికి పంపించింది. అక్కడ తన అత్తయ్యకు ఆ బాలిక విషయమంతా చెప్పింది. ఆమె నుంచి విషయం తెలుసుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన తరుణ్ గతేడాదే జైలు నుంచి విడుదలయ్యాడు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement