హర్యానాలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 123 కేసులు

ABN , First Publish Date - 2020-05-29T02:36:33+05:30 IST

హర్యానాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ పదుల సంఖ్యలో ...

హర్యానాలో పెరుగుతున్న కరోనా.. 24  గంటల్లో 123 కేసులు

చండీఘర్: హర్యానాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ పదుల సంఖ్యలో నమోదైన కొత్త కేసులు ఇప్పుడు వంద దాటుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్రంలో 120కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ  విషయం వెల్లడవుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా 123 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 1,504కు చేరింది. 19 మరణాలు సంభవించాయి. 881 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 604 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-29T02:36:33+05:30 IST