కార్తీకంలో 1,28,198 వ్రతాలు

ABN , First Publish Date - 2021-12-06T05:45:34+05:30 IST

ప్రముఖ పుణ్య క్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి కార్తీక మాసంలో భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. మొత్తం 1,28,198 వ్రతాలు జరగ్గా కేవలం వ్రత విభాగం ద్వారా స్వామి వారి ఖజానాకు రూ.7,31,84,800 ఆదాయం లభించినట్టు ఈవో త్రినాథరావు పేర్కొన్నారు.

కార్తీకంలో 1,28,198 వ్రతాలు

  • సత్యదేవునికి రూ.7.31 కోట్ల ఆదాయం

అన్నవరం, డిసెంబరు 5: ప్రముఖ పుణ్య క్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి  కార్తీక మాసంలో భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. మొత్తం 1,28,198 వ్రతాలు జరగ్గా కేవలం వ్రత విభాగం ద్వారా స్వామి వారి  ఖజానాకు రూ.7,31,84,800 ఆదాయం లభించినట్టు ఈవో త్రినాథరావు పేర్కొన్నారు. హుండీల లెక్కింపు అనంతరం పూర్తి ఆదాయ వివరాలు వెల్లడిస్తామని, సుమారు రూ.16.50 కోట్ల వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కార్తీక మాసంలో 2019లో జరిగిన 1,37,050 వ్రతాలు రికార్డు కాగా ఈ ఏడాది దానిని అధిగమిస్తామని భావించగా నాలుగు జిల్లాల్లో తుఫాను ప్రభావంతో వ్రతాల సంఖ్య తగ్గిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్రత పురోహితులు, సిబ్బంది కష్టపడి పనిచేశారని ఈవో తెలిపారు. కాగా దేవస్థానంలో స్వామివారి ప్రసాదాలను ప్యాకింగ్‌ చేసే ప్యాకర్లకు ఒక్కో ప్యాకెట్‌కు 70పైసలు కమీషన ఇస్తున్నారు. దానిని రూ.1.25కు పెంచాలని ప్యాకర్లు ఆదివారం ఈవో త్రినాథరావును కోరారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబ పోషణ భారమైందని వారు తెలపగా.. సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీనిచ్చారు.

Updated Date - 2021-12-06T05:45:34+05:30 IST