ఆగస్టు - సెప్టెంబరులో 12వ తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2021-06-22T07:04:40+05:30 IST

తాము రూపొందించిన 30-30-40 ఫార్ములా ఆధారంగా కేటాయించిన మార్కులతో సంతృప్తి

ఆగస్టు - సెప్టెంబరులో 12వ తరగతి పరీక్షలు

బోర్డు మార్కులు నచ్చనివారికే: సీబీఎ్‌సఈ


న్యూఢిల్లీ, జూన్‌ 21: తాము రూపొందించిన 30-30-40 ఫార్ములా ఆధారంగా కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు ఆగస్టు 15 - సెప్టెంబరు 15 తేదీల మధ్యలో పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు సీబీఎ్‌సఈ తెలిపింది. ఇవి తాత్కాలిక తేదీలు మాత్రమేనని, అప్పటి పరిస్థితుల అనుకూలతను బట్టి పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని సోమవారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు జూన్‌ 17న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకొన్నట్టు సీబీఎ్‌సఈ వెల్లడించింది. 12వ తరగతి ఫలితాలను జూలై 31న విడుదల చేయనున్నట్టు తెలిపింది. ప్రైవేటు, కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులకు 2019-20లో ప్రకటించిన అసె్‌సమెంట్‌ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. రెగ్యులర్‌ విద్యార్థులకు నిర్వహించే తేదీల్లోనే వీరికి కూడా పరీక్షలు ఉంటాయని పేర్కొంది. 


ఆ అభ్యంతరాలనే పరిశీలిస్తాం:ఐఎ్‌ససీ

ఐఎ్‌ససీ బోర్డు కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. 12వ తరగతి ఫైనల్‌ ఫలితాలను జూలై31లోగా ప్రకటించడానికి చర్యలు తీసుకొంటామని తెలిపింది. ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రాతపూర్వకంగా సంబంధిత స్కూళ్లకు తెలియజేయాలని, స్కూళ్ల ద్వారా వచ్చే అభ్యంతరాలనే బోర్డు పరిశీలిస్తుందని పేర్కొంది. ఫలితాలు వెల్లడించిన 7రోజుల్లోగా విద్యార్థుల అభ్యంతరాలు బోర్డుకు చేరాలని సూచించింది.


Updated Date - 2021-06-22T07:04:40+05:30 IST