Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోజూ రాత్రిళ్లు ఆ ఇంటికి కొందరు మహిళలు, కుర్రాళ్ల రాకపోకలు.. స్థానికులకు డౌట్.. అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తే గదుల్లో..

ఇంటర్నెట్ డెస్క్: అది రెండస్థుల భవనం. కొందరు మహిళలు, కురాళ్లు ఆ ఇంటికి తరచూ వస్తూ పోతున్నారు. గత రెండేళ్లుగా ఇదంతా గమనిస్తున్న స్థానికులు.. అక్కడేదో మతలబు ఉందని భావించారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని గదులను పోలీసులు తనిఖీలు చేయగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్‌కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆయన భార్యకు డబ్బు అంటే పిచ్చి. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ నీచమైన పనికి గ్వాలియర్‌లోని తమ రెండస్థుల భవనాన్ని ఇచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రీతమ్ ఇంటికి కొందరు మహిళలు, వారి వెంటే కొందరు కుర్రాళ్లు వస్తూ పోతుండేవారు. అలా వచ్చి పోయే వారి సంఖ్య కొద్ది రోజుల క్రితం వరకూ తక్కువగానే ఉండటంతో ఆ విషయాన్ని స్థానికులు లైట్ తీసుకున్నారు. ఇలా వచ్చి పోయే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. దీంతో ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని స్థానికులు డౌట్ పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 


బుధవారం అర్ధరాత్రి.. పోలీసులు ఆ బిల్డింగ్‌పై రైడ్ చేశారు. దీంతో విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. ప్రీతమ్ ఇంటిలోని తనిఖీ చేయగా.. ఓ గదిలో ముగ్గురు మహిళలతో ఇద్దరు యువకులు అసభ్యకర స్థితిలో ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పై అంతస్థులో మరో మహిళ.. ఏడుగురు వ్యక్తులు ఉండటంలో వారిని కూడా అరెస్ట్ చేశారు. ప్రీతమ్ ఇంట్లో రెండేళ్లుగా వ్యభిచారం జరరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతడి భార్య.. సదరు మహిళలకు విటులు ఇచ్చిన మొత్తంలోంచి సగం డబ్బును తీసుకునేదని పోలీసుల విచారణలో తేలింది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement