Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 9 2021 @ 19:31PM

అమ్మకానికి మరో 13 విమానాశ్రయాలు!

న్యూఢిల్లీ: దేశంలోని విమానాశ్రయాలు క్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భారీ ఎత్తున నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించగా, తాజాగా, ఇందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నాటికి 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు అంగీకరించింది. ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నాయి. వీటిని కలిపేసి మరింత పెద్ద విమనాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నారు. 


ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉండగా,  ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్‌పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి. మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3,700 కోట్లు  ప్రైవేటు పెట్టబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.


వారణాసి విమానాశ్రయంలో కుషినగర్, గయను కలిపేయనుండగా, అమృత్‌సర్‌లో కంగ్రాను, భువనేశ్వర్‌ను తిరుపతితో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్‌తోను, ఇండోర్‌ను జబల్‌పూర్‌తోను, తిరుచ్చిని హుబ్లీతో కలిపేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా ఏఏఐ అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది.  వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు కావడంతోపాటు వారణాసి పవిత్ర పుణ్యస్థలం కావడం మరో కారణం.


చిన్న విమానాశ్రయాలను పెద్దవాటితో కలపడం దేశంలో ఇదే తొలిసారి కానుంది. పీపీఈ మోడ్‌లో ఆదాయ పంపకాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓనర్‌షిప్ మాత్రం ప్రభుత్వానిదే. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను పీపీపీ మోడ్‌లోనే అభివృద్ధి చేశారు. త్వరలోనే జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను త్వరలోనే స్వాధీనం చేసుకోనున్న అదానీ గ్రూప్.. నవీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఇవన్నీ ఇప్పటికే స్వతంత్ర ప్రాతిపదికన ప్రైవేటీకరణ పూర్తిచేసుకున్నాయి.  

Advertisement
Advertisement