13 టన్నుల అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-28T06:19:21+05:30 IST

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 13 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు.

13 టన్నుల అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత
స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కి తరలించిన డిటీ కమల్‌సుందర్‌

కొవ్వూరు, జనవరి 27 : కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 13 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు. గురువారం అధికారుల బృందం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కన్నాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 13 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యం నిడదవోలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కి తరలించి, వ్యాన్‌ను పట్టణ పోలీసులకు అప్పగించారు. సరుకు రవాణాదారుడు గ్రంది శ్రీనివాస్‌, మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు.

180 క్వింటాళ్లు పట్టివేత

కొయ్యలగూడెం, జనవరి 27: మండలంలోని నర్సంపాలెం గ్రామం వద్ద వాహనంలో తరలిస్తున్న 180 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్ని లారీని సీజ్‌ చేశారు. బియ్యం తరలిస్తున్న వారి పై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు డిప్యూటీ తాహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై సతీష్‌, పోలీస్‌, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T06:19:21+05:30 IST