వయస్సు 13 ఏళ్లే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. ఈ కుర్రాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

ABN , First Publish Date - 2021-11-14T23:16:06+05:30 IST

ఆ కుర్రాడికి 13 ఏళ్లే. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ తన బాధను పక్కన పెట్టి.. ఇతరుల కడుపు నింపడంపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడు తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు విషయం తెలుసుకుని.. అత

వయస్సు 13 ఏళ్లే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. ఈ కుర్రాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

ఎన్నారై డెస్క్: ఆ కుర్రాడికి 13 ఏళ్లే. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ తన బాధను పక్కన పెట్టి.. ఇతరుల కడుపు నింపడంపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడు తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు విషయం తెలుసుకుని.. అతడి నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆ చిన్నోడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని మిస్సిసీపికి చెందిన 13ఏళ్ల అబ్రహం ఒలగ్‌బెగి గత కొన్ని రోజులుగా ‘అప్లాస్టిక్ ఎనీమియా’ అనే అరుదైన వ్యాధితో బాధపతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యాధికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చిన్న చిన్న కోరికలను తీర్చే స్వచ్ఛంద సంస్థ ‘మేక్ మై విష్’ అతడి కోరికను తీర్చేందుకు ముందుకొచ్చింది. ఇటువంటి సందర్భాల్లో చాలా మంది చిన్నారులు.. డెస్నీలాండ్‌కు వెళ్లాలనో లేదా ఇష్టమైన సెలబ్రెటీని కలవాలనో కోరుకుంటారు. అయితే.. అబ్రహం అలా చేయలేదు. ఇల్లు లేని వారి కడుపు నింపాలంటూ తన కోరికను వ్యక్తపరిచాడు. 



ఈ నేపథ్యంలోనే ఆ స్వచ్ఛంద సంస్థ.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి నెలలో మూడవ శనివారంరోజు.. ఇల్లు లేని వారికి ఆహారాన్ని అందించేందుకు ఒప్పుకుంది. ఇందులో భాగంగానే తాజాగా మిస్సిసీపిలోని జాక్సాన్ ప్రాంతంలో ఉన్న సుమారు 80 మందికి అబ్రహం ఆహారపదార్థాలను అందించాడు. కాగా.. ‘మేక్ మై విష్’ సహకారంతో వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అబ్రహం.. ‘అబ్రహమ్స్ టేబుల్’ అనే స్వచ్ఛంద సంస్థను స్వయంగా నెలకొల్పాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అబ్రహమ్ కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.




Updated Date - 2021-11-14T23:16:06+05:30 IST