Viral video: అద్భుతమైన వంటలతో నెటిజెన్ల చేత ఔరా! అనిపిస్తున్న 13 ఏళ్ల బాలుడు

ABN , First Publish Date - 2021-11-25T06:29:30+05:30 IST

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచంలో జరిగే అద్భుతాలు, వింతల గురించి సోషల్ మీడియా మనకు తెలియజేస్తోంది. అలాంటి అద్భుతాలలో అసాధారణ వ్యక్తుల ప్రతిభ కూడా ఒకటి. ప్రస్తుతం నెట్టింట్లో ఒక 13 ఏళ్ల బాలుడి వీడియో తెగ వైరల్ అవుతోంది...

Viral video: అద్భుతమైన వంటలతో నెటిజెన్ల చేత ఔరా! అనిపిస్తున్న 13 ఏళ్ల బాలుడు

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచంలో జరిగే అద్భుతాలు, వింతల గురించి సోషల్ మీడియా మనకు తెలియజేస్తోంది. అలాంటి అద్భుతాలలో అసాధారణ వ్యక్తుల ప్రతిభ కూడా ఒకటి. ప్రస్తుతం నెట్టింట్లో ఒక 13 ఏళ్ల బాలుడి వీడియో తెగ వైరల్ అవుతోంది. అతని పాక కళని చూసి అందరూ ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు.


హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌కు చెందిన దీపేష్(13) అనే బాలుడు తన అద్భుతమైన వంట నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పెద్ద పెద్ద చెఫ్‌లు సైతం అతను వంటకాలు చూసి ఇది నిజమేనా! అని అంటున్నారు. దీపేష్ చేసే కుకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో 3వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియో విశాల్ అనే ఒక ఫుడ్ బ్లాగర్ అప్‌లోడ్ చేశాడు.


ఆ వీడియోలో దీపేష్ వంట చేస్తూనే విశాల్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు. దీపేష్ తన తల్లిదండ్రుల, చదువు గురించి ఒకవైపు విశాల్‌తో చెబుతూ మరోవైపు తన వంటను సవ్యంగా పూర్తిచేశాడు. తాను రోజూ పాఠశాలకు వెళ్తానని, సాయంత్రం మాత్రమే తన స్టాల్ తెరిచి రాత్రి 8 లేదా 9 గంటల వరకు వంట చేస్తానని దీపేష్ వివరించాడు. దీపేష్ తన వంతుగా కొంత అదనపు ఆదాయంతో తన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని కూడా చెప్పాడు.


దీపేష్ చేసే వంటకాలలో మిరపకాయలు, స్ప్రింగ్ రోల్స్, చిల్లీ పొటాటో, మోమోలు మొదలైనవాటి రుచి అద్భుతంగా ఉందని విశాల్ చెప్పుకొచ్చాడు.


Updated Date - 2021-11-25T06:29:30+05:30 IST