13 ఏళ్ల కూతురికి పదే పదే తలనొప్పి.. మాత్రలకు తగ్గకపోవడంతో ఆస్పత్రికి.. పరీక్షలు చేశాక డాక్టర్ చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-01-21T23:59:15+05:30 IST

ఆ బాలిక వయసు 13 ఏళ్లు. పదే పదే తలనొప్పి వస్తుంటే మాత్రలు వేసుకుంది. అయినా కూడా తగ్గకపోవడంతో తల్లిదండ్రులకు చెప్పింది.

13 ఏళ్ల కూతురికి పదే పదే తలనొప్పి.. మాత్రలకు తగ్గకపోవడంతో ఆస్పత్రికి.. పరీక్షలు చేశాక డాక్టర్ చెప్పింది విని..

ఛత్తీస్‌గఢ్: ఆ బాలిక వయసు 13 ఏళ్లు. పదే పదే తలనొప్పి వస్తుంటే మాత్రలు వేసుకుంది. అయినా కూడా తగ్గకపోవడంతో తల్లిదండ్రులకు చెప్పింది. వారు కంగారుపడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చెప్పింది విని అంతా షాకయ్యారు. పూర్తి వివరాల్లోకెళ్తే..


ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఎపుడూ చురుగ్గా ఉండేది. ఎప్పటికప్పుడు ఫొటోలను దిగి అప్‌లోడ్ చేసేది. అయితే అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెను ఆకర్షించడానికి బాలిక షేర్ చేసిన ప్రతి ఫొటోను లైక్ చేస్తూ.. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ చేసేవాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆమెకు అతడికి పరిచయం పెరిగింది. ఈ క్రమంలోనే వారిద్దరు ఒకరి ఫోన్ నెంబర్లు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేస్తూ మాట్లాడేవాడు. అలా అతడు బాలికను ప్రేమలోకి దించాడు. 


ఈ క్రమంలోనే గత సంవత్సరం డిసెంబర్ నెల మొదటి వారంలో అతడు బాలికకు ఫోన్ చేసి తనని కలవాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె ప్రియుడిని కలవడానికి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. అలా ఇద్దరూ బయట కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అతడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి ఆమెను తలనొప్పి వేధిస్తోంది. మాత్రలు వేసుకున్నా ఎంతకీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు బాలిక గర్భవతి అని చెప్పాడు. అది విన్న తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఈ విషయమై బాలికను నిలదీయగా జరిగిందంతా చెప్పింది. కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-21T23:59:15+05:30 IST