Parliament sessions : అక్షరాలా 133 కోట్లు బూడిదపాలు

ABN , First Publish Date - 2021-08-01T01:41:29+05:30 IST

పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ప్రారంభమే వాయిదాలతో ప్రారంభమైంది. పెగాసస్ వ్యవహారంపై

Parliament sessions : అక్షరాలా 133 కోట్లు బూడిదపాలు

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ప్రారంభమే వాయిదాలతో ప్రారంభమైంది. పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ తొమ్మిది రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు కూడా. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘‘లెక్క ప్రకారం 107 గంటల పాటు కార్యకలాపాలు జరగాలి. కానీ కేవలం 18 గంటలు మాత్రమే సభా కార్యకలాపాలు సజావుగా సాగాయి. అంటే సుమారు 89 గంటల పార్లమెంట్ సమయం వృథా అయిపోయింది. దీనివల్ల 133 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి’’ అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2021-08-01T01:41:29+05:30 IST