130 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లకు కరోనా

ABN , First Publish Date - 2020-11-15T01:32:25+05:30 IST

130 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లకు కరోనా

130 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లకు కరోనా

వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 130 మందికి పైగా యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పేర్కొంది.


కరోనా పాజిటివ్ వచ్చిన 130 మంది ఆఫీసర్లను క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కొంతవరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు నిర్వహించిన ప్రచార ర్యాలీలతో ముడిపడి ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2020-11-15T01:32:25+05:30 IST