134 కార్లు.. గాలికి కొట్టుకొచ్చి ఒకదాన్ని మరోటి ఢీకొట్టడంతో..

ABN , First Publish Date - 2021-01-20T11:23:31+05:30 IST

రోడ్డుపై ఉన్న కార్లు ఉన్నట్టుండి గాలికి కొట్టుకొచ్చి ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన జపాన్ దేశంలోని మియాగీ ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాగీ ప్రాంతం బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి.

134 కార్లు.. గాలికి కొట్టుకొచ్చి ఒకదాన్ని మరోటి ఢీకొట్టడంతో..

టోక్యో: రోడ్డుపై ఉన్న కార్లు ఉన్నట్టుండి గాలికి కొట్టుకొచ్చి ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన జపాన్ దేశంలోని మియాగీ ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాగీ ప్రాంతం బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. ఓ మంచు తుఫాను ఈ ప్రాంతాన్ని వణికించింది. 100కిలో మీటర్లపైగా వేగంతో గాలులు వీయడంతో రోడ్డుపై వస్తున్న వాహనాలు అదుపు తప్పాయి. ఒకదాన్నొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 134 కార్లు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలపాలవగా.. ఒకరు మృతి చెందారు.

Updated Date - 2021-01-20T11:23:31+05:30 IST