శతాబ్దం నాటి ఇంటిని పెకలించి తరలించారు.. ఖర్చు తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2021-02-22T20:04:03+05:30 IST

ఇష్టంగా కట్టుకున్న ఇంటిని ఎవ్వరూ అంత తొందరగా వదులు కోరు. రోడ్డు విస్తరణ సందర్భంగానో లేదా ఇతర కారణాల వల్లో ప్రేమతో కట్టుకున్న ఇల్లును కూల్చాల్సిన పరిస్థితులు వస్తే.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని

శతాబ్దం నాటి ఇంటిని పెకలించి తరలించారు.. ఖర్చు తెలిస్తే షాక్..!

వాషింగ్టన్: ఇష్టంగా కట్టుకున్న ఇంటిని ఎవ్వరూ అంత తొందరగా వదులు కోరు. రోడ్డు విస్తరణ సందర్భంగానో లేదా ఇతర కారణాల వల్లో ప్రేమతో కట్టుకున్న ఇల్లును కూల్చాల్సిన పరిస్థితులు వస్తే.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఏమాత్రం ధ్వంసం కాకుండా ఏకంగా ఇంటినే కొద్దిగా పక్కకు జరుపుకొంటున్నారు. ఇటువంటి వార్తలు ఈ మధ్య సాధారణం అయిపోయాయి. అయితే శాన్‌‌ఫ్రాన్సిస్కో‌లో మాత్రం ఒకతను రెండు అంతస్థులు, ఆరు బెడ్‌రూంలు ఉన్న తన ఇంటిని రూ.2.9కోట్లు ఖర్చు చేసి.. పునాదులతో సహా పెకలించి ఏకంగా వీధులే దాటించేశాడు. ఈ క్రమంలో చక్రాలపై వీధులు దాటి తరలిపోతున్న ఇంటిని చూసేందుకు జనం ఎగబడ్డారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను ఫోన్‌లలో బంధించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని స్పందించారు. 139ఏళ్ల తన ఇంటిని వేరే ప్రదేశానికి తరలించాలని కొన్నేళ్ల కిందనే అనుకున్నాని తెలిపారు. నిపుణుల సహాయంతో ఆదివారం రోజు 807 ఫ్రాంక్లిన్ స్ట్రీట్ నుంచి 635ఫుల్టన్ స్ట్రీట్‌కు 1 mph వేగంతో తన ఇంటిని తరలించినట్టు చెప్పారు. దాదాపు 15 ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఇంటిని తరలించినట్టు తెలిపారు. ఇందుకోసం 4లక్షల డాలర్లను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఈ ఇల్లుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని పట్ల స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-02-22T20:04:03+05:30 IST