ఖమ్మంలో 14అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహం

ABN , First Publish Date - 2021-04-14T05:39:39+05:30 IST

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఖమ్మంలో బుధవారం జడ్పీసెంటర్‌లో 14 అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రరవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించనున్నారు.

ఖమ్మంలో 14అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహం
ఖమ్మంలో ఆవిష్కరణకు సిద్దంగా 14అడుగుల అంబేద్కర్‌ విగ్రహం

 నేడు ఆవిష్కరించనున్న మంత్రి పువ్వాడ 

ఖమ్మం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఖమ్మంలో బుధవారం జడ్పీసెంటర్‌లో 14 అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రరవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించనున్నారు. ఇప్పటి వరకు జడ్పీసెంటర్‌గా ఉన్న ఆ కూడలి పేరును అంబేద్కర్‌ సెంటర్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈకూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం చిన్నదిగా ఉండటం, చాలాకాలం క్రితం ప్రతిష్ఠంచింది కావడంతో మంత్రి పువ్వాడ చొరవతీసుకుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో రూ.25లక్షలు వెచ్చించి 14అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారుచేయించారు. విగ్రహం చుట్టూ పచ్చనిమొక్కలతో సుందరీకరించారు. గ్రీనరీతో సుందరీకరణ పనులు కూడా చేపట్టారు.


Updated Date - 2021-04-14T05:39:39+05:30 IST