‘ఆర్‌సీ రెడ్డి’కి 14 ర్యాంకులు

ABN , First Publish Date - 2020-08-05T09:08:10+05:30 IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో అశోక్‌నగర్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌కు 14 ర్యాంకులు

‘ఆర్‌సీ రెడ్డి’కి 14 ర్యాంకులు

  • సత్తా చాటిన సీఎస్‌బీ అకాడమీ అభ్యర్థులు 

చిక్కడపల్లి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో అశోక్‌నగర్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌కు 14 ర్యాంకులు లభించాయని సంస్థ అధినేత ఆర్‌సీ రెడ్డి తెలిపారు. మల్లవరపు సూర్యతేజ(76), ఎన్‌.విశాల్‌ నర్వాడ(91), కె.ప్రేమ్‌సాగర్‌(170), వి.తేజదీపక్‌(279), మోహనకృష్ణ(283), రేణుకుంట్ల శీతల్‌కుమార్‌(417), కె.కార్తీక్‌(428), చిలుముల రజనీకాంత్‌(598), అలేఖ్య రాళ్ల(602), దీపక్‌సింగ్‌(686), దరిపెల్లి రమేశ్‌(690), పలని ఫణికిరణ్‌(698), బచ్చు ధీరజ్‌కుమార్‌(768), రవికుమార్‌ మీనా(793) ర్యాంకులు సాధించారని వెల్లడించారు.


ర్యాంకులు సాధించినవారిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులున్నారని ఆర్‌సీ రెడ్డి వివరించారు. కాగా, పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని సీఎ్‌సబీ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు బాలలత అన్నారు. సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఎంవీ సత్యసాయి కార్తీక్‌(103), కె ప్రేమ్‌సాగర్‌(170)లను అశోక్‌నగర్‌లోని సీఎ్‌సబీ ఐఏఎస్‌ అకాడమీలో ఆమె అభినందించారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ క్రమశిక్షణ పాటిస్తూ ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుందన్నారు. మొదటి ప్రయత్నంలోనే రాకపోతే నిరుత్సాహ పడకూడదని, తిరిగి ప్రయత్నించాలని చెప్పారు.

Updated Date - 2020-08-05T09:08:10+05:30 IST