Advertisement
Advertisement
Abn logo
Advertisement

14 జట్లతో వన్డే.. 20 జట్లతో టీ20 ప్రపంచకప్

దుబాయ్: ప్రపంచకప్ రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటివరకు 8 జట్లు, 10 జట్లతో నిర్వహించిన పురుషుల వన్డే ప్రపంచకప్ ఇకపై 14 జట్లతో నిర్వహించున్నారు. 2027 ప్రపంచకప్ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ నేడు అధికారిక ప్రకటన చేసింది. 2027, 2031 ప్రపంచకప్‌ టోర్నీల్లో 14 జట్లు పోటీపడతాయని, మొత్తం జట్లు కలిపి 54 మ్యాచ్‌లు ఆడతాయని తెలిపింది. అంతేకాకుండా మెన్స్ టీ20 ప్రపంచకప్ కూడా 20 జట్లతో నిర్వహిస్తామని వెల్లడించింది. 2024, 2026, 2028, 2030 ప్రపంచకప్ ఎడిషన్లలో 20 జట్ల చొప్పున పాల్గొంటాయని, ప్రతి టోర్నీలోనూ 55 మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది.

Advertisement
Advertisement